రవితేజ జోడీ కడుతున్న కన్నడ బ్యూటీ రష్మిక!
- తెలుగులో 'పుష్ప'తో హిట్ కొట్టిన రష్మిక
- హిందీలో గుర్తింపు తెచ్చిపెట్టిన 'మిషన్ మజ్ను'
- తమిళంలో సంతృప్తినిచ్చిన 'వరిసు'
- రవితేజ - గోపీచంద్ మలినేని సినిమాకి గ్రీన్ సిగ్నల్
ఆ తరువాత బాలీవుడ్ లో చేసిన 'మిషన్ మజ్ను' .. కోలీవుడ్ లో చేసిన 'వరిసు' ఆమె గ్రాఫ్ ను నిలకడగా ఉంచుతూ వెళ్లాయి. ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాకి సంబంధించిన పనులతో ఆమె బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె తెలుగులో మరో ప్రాజెక్టును ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా రవితేజ సరసన కావడం విశేషం.
రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'డాన్ శీను' .. 'బలుపు' .. 'క్రాక్' వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. హ్యాట్రిక్ హిట్ తరువాత ఈ ఇద్దరూ కలిసి మరోసారి సెట్స్ పైకి వెళుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను ఖరారు చేసినట్టుగా చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి త్వరలో అధికారిక ప్రకటన రానుంది.