పవన్ కల్యాణ్‌ను, లోకేశ్‌ను ఇబ్బందులకు గురి చేయాలనే: ప్రత్తిపాటి
- చంద్రబాబుపై బురద జల్లేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందన్న మాజీ మంత్రి
- వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భారీ ఓటమి తప్పదని హెచ్చరిక
- పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తోందని ఆరోపణ
ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ... రాష్ట్రంలో కొంతమంది ఉన్నతాధికారులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు మద్దతుగా దేశవిదేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయని, మహిళలు, యువత సహా ప్రజలంతా రోడ్ల పైకి వస్తున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను అణచివేయాలని అధికార పార్టీ చూస్తోందన్నారు.