నారా బ్రాహ్మణి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి రోజా

Roja take a dig at Nara Brahmani
  • నిన్న రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన నారా బ్రాహ్మణి
  • మీ మామ చంద్రబాబు ఎంతటి వెన్నుపోటుదారుడో తెలుసుకో అంటూ రోజా ఫైర్
  • ఎన్టీఆర్ చివరి రోజుల్లో విడుదల చేసిన వీడియో చూడాలని హితవు
  • బ్రహ్మాస్త్రం అనుకుంటున్న బ్రాహ్మణి తుస్సుమందని ఎద్దేవా
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి నిన్న రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. మీ మామ చంద్రబాబు ఎంత వెన్నుపోటుదారుడో తెలియదా? అని ప్రశ్నించారు. కావాలంటే, ఎన్టీఆర్ చివరి రోజుల్లో విడుదల చేసిన వీడియోను బ్రాహ్మణి ఓసారి చూడాలని హితవు పలికారు. 

దేవాన్ష్ కు పొరపాటున కూడా సీఐడీ రిమాండ్ రిపోర్ట్ చూపించవద్దని, ఒకవేళ ఆ రిపోర్ట్ చూపిస్తే మా తాత ఇంత అవినీతిపరుడా అని దేవాన్ష్ అనుకుంటాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఏ సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారంటున్న బ్రాహ్మణి... ఓసారి సీఐడీ ఆఫీసుకెళ్లి అడిగితే సాక్ష్యాధారాలు చూపిస్తారని రోజా అన్నారు. 

బ్రాహ్మణి మాటలు చూస్తే, ఆమెకు చదువు చెప్పిన వాళ్లు తల గోడకేసి కొట్టుకుంటారని వ్యంగ్యం ప్రదర్శించారు. బ్రాహ్మణిని ఓ బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారని, కానీ ఆమె తుస్సుమందని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Roja
Nara Brahmani
Chandrababu
Arrest
YSRCP
TDP

More Telugu News