శరీరాన్ని విల్లులా వంచిన మహేశ్ బాబు... ఒళ్లొంచితేనే ఆరోగ్యం అని సలహా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శరీరాన్ని విల్లులా వంచిన మహేశ్ బాబు... ఒళ్లొంచితేనే ఆరోగ్యం అని సలహా

Mahesh Babu explains Super Stretch
  • ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో మహేశ్ బాబు టాప్
  • స్లిమ్ ఫిజిక్ తో కుర్రకారుకు సవాల్ విసిరే మహేశ్ బాబు 
  • సూపర్ స్ట్రెచ్ గురించి వివరించిన సూపర్ స్టార్
ఫిట్ నెస్ కు అత్యంత ప్రాధాన్యమిచ్చే టాలీవుడ్ హీరోల్లో మహేశ్ బాబు ముందువరుసలో ఉంటారు. మహేశ్ బాబును చూస్తే ఆయన వయసు రివర్స్ లో నడుస్తోందా? అనిపిస్తుంది. టీనేజ్ ప్రాయంలో ఉన్న కొడుకు గౌతమ్ తో పోటీపడుతూ మహేశ్ బాబు ఎంతో స్లిమ్ గా మారడం తెలిసిందే. తిండి విషయంలోనూ మహేశ్ పక్కాగా జాగ్రత్తలు తీసుకుంటారు. 

తాజాగా, ఈ సూపర్ స్టార్ తన ఫిజికల్ వర్కౌట్లకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. అందులో, మహేశ్ బాబు తన శరీరాన్ని విల్లులా వెనక్కి వంచడాన్ని చూడొచ్చు. 

దీన్ని ఆయన సూపర్ స్ట్రెచ్ అని పేర్కొన్నారు. ఈ వర్కౌట్ ద్వారా వీపు కింది భాగం, వెన్నుపూస, భుజాలను ఏకకాలంలో సాగదీసినట్టుగా చేయొచ్చని మహేశ్ బాబు వివరించారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేస్తూ ఉండడమే మందు అని సలహా ఇచ్చారు.
Advertisement
Mahesh Babu
Super Stretch
Fitness
Workouts
Superstar
Tollywood

More Telugu News