రామచరితమానస్ ఓ సైనైడ్.. బీహార్ మంత్రి సంచలన వ్యాఖ్య
- హిందూ మత గ్రంథాలు సైనైడ్ కలిపిన ఆహారమంటూ మంత్రి చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్య
- ఈ విషయంలో తన అభిప్రాయాలు స్థిరమైనవని స్పష్టీకరణ
- మురుగులో దిగేవారి కులాలు మారే వరకూ దేశంలో రిజర్వేషన్ల అవసరం ఉంటుందని వ్యాఖ్య
ఈ వ్యాఖ్యలపై సీఎం నితీశ్ కుమార్ టార్గెట్‌గా బీజేపీ విమర్శలు గుప్పించింది. ‘‘మంత్రి చంద్రశేఖర్ వరుసగా రామచరితమానస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. నితీశ్ కుమార్‌కు ఇవి వినపడట్లేదా? నితీశ్ నిరంతరంగా సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు. సనాతన ధర్మంతో చంద్రశేఖర్‌కు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆయనను మతం మార్చుకోమనండి’’ అంటూ బీజేపీ ప్రతినిధి నీరజ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.