'పుష్ప... తగ్గేదేలే.. కంగ్రాట్స్ బన్నీ' అంటూ జక్కన్న ట్వీట్

SS Rajamouli tweet on Allu Arjun
  • స్టైలిష్ స్టార్‌కు అభినందనల వెల్లువ
  • ఆర్ఆర్ఆర్ సినిమా సిక్సర్ కొట్టిందంటూ రాజమౌళి ట్వీట్
  • అలియాభట్‌కు కూడా అభినందనలు తెలిపిన దర్శక దిగ్గజం
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ ఉత్తమ అవార్డు రావడంపై జక్కన్న స్పందించారు. పుష్ప... తగ్గేదేలే, అభినందనలు బన్నీ అంటూ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. అవార్డులు గెలుచుకున్న పలువురికి అభినందనలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా సిక్సర్ కొట్టిందంటూ పేర్కొన్నారు. ఈ సినిమాకు గాను అవార్డులు దక్కించుకున్న వారికి, సినిమా టీమ్‌కు అభినందనలు తెలిపారు. గంగుభాయి కతియావాడిలో నటించిన అలియా భట్‌కు అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్‌కు అభినందనలు తెలియజేసేందుకు ఆయన నివాసానికి అభిమానులు, సినీ ప్రముఖులు తరలి వచ్చారు. పలువురు అభిమానులు అల్లు అర్జున్‌ని ఎత్తుకొని మరీ ఆనందాన్ని పంచుకున్నారు.
Advertisement
ss rajamouli
Allu Arjun

More Telugu News