చంద్రయాన్-3: ఇస్రో బృందంలో నగరి మహిళా శాస్త్రవేత్త, రోజా ట్వీట్

Roja special thanks to nagari kalpana kalahasti
  • ఇస్రోకు మరోసారి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రోజా
  • అపురూపమైన కలను సాకారం చేసిన శాస్త్రవేత్తల బృందానికి రోజా అభినందనలు
  • ఇస్రో బృందంలో నగరికి చెందిన మహిళా శాస్త్రవేత్త
  • ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ రోజా ట్వీట్
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోకు ఏపీ మంత్రి రోజా శుభాకాంక్షలు తెలిపారు. నిన్న ప్రయోగం సక్సెస్ కాగానే రోజా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అయితే ఇస్రోలో నగరి నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా శాస్త్రవేత్త ఉన్నారు. దీంతో రోజా నేడు మరోసారి ఆమెను విష్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఇస్రోకు శుభాకాంక్షలు... ఈ ప్రయోగం భారత్‌కు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. అపురూపమైన కలను సాకారం చేసిన శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. ఈ బృందంలో ఆంధ్రప్రదేశ్ నగరి రూరల్ మండలం తడుకుపేటకు చెందిన అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన కాళహస్తి గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Roja
ISRO
nagari
Andhra Pradesh

More Telugu News