Varun Tej: పెళ్లి తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ లలో ఎవరు మారిపోయారనే ప్రశ్నకు వరుణ్ తేజ్ ఆసక్తికర సమాధానం!

Varun Tej interesting answer to a question on after marriage life
షార్ట్స్‌లో చూడండి
మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. మరోవైపు ఆయన తాజా చిత్రం 'గాండీవధారి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో వరుణ్ కు యాంకర్ సుమ ఒక ఇంటరెస్టింగ్ క్వశ్చన్ వేసింది.

అల్లు అర్జున్, రామ్ చరణ్ లలో పెళ్లి అయిన తర్వాత ఎవరు మారిపోయారు అంటూ వరుణ్ ను సుమ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు వరుణ్ కొంత తడబడినప్పటికీ.. చివరకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. వాస్తవానికి ఈ ప్రశ్నను వాళ్లనే అడిగితే బాగుంటుందని అన్నాడు. పెళ్లి అయిన తర్వాత ఎవరైనా మారిపోవాల్సిందేనని, నోరు మూసుకుని ఉండాల్సిందేనని చెప్పాడు. 'ఎఫ్ 2' మూవీలో దర్శకుడు అనిల్ రావిపూడి తమకు ఇదే నేర్పించాడని అన్నాడు. ఈ సమాధానంతో అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. 

Go Back to Shorts
Varun Tej
Ramcharan
Allu Arjun
Tollywood
Marriage

More Telugu News