పెంపుడు శునకం మృతితో విషాదంలో మహేశ్ బాబు కుటుంబం
- మహేశ్ ఇంట్లో ప్లూటో అనే శునకం ఇటీవలే మృతి
- నీవు లేని లోటు ఎప్పటికీ ఉంటుందని నమ్రత పోస్ట్
- నిన్ను ఎంతో మిస్ అవుతున్నానంటూ సితార స్పందన
‘‘ప్లూటో.. మా హృదయాల్లో నీవు లేని లోటు ఎప్పటికీ ఉంటుంది’’ అని నమ్రత పేర్కొంది. ‘బాధాకరమైన విషయం. సో సారీ’ అంటూ ఓ అభిమాని రిప్లయ్ ఇచ్చాడు. చాలా మంది యూజర్లు హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశారు. ‘‘నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను’’ అంటూ సితార సైతం ఇన్ స్టా లో పోస్ట్ పెట్టింది. దీనికి నమ్రత స్పందిస్తూ ‘‘మన హృదయాల్లో, ప్రార్థనల్లో అది ఎప్పటికీ జీవించి ఉంటుంది’’ అని పేర్కొంది.