Jagan: కింద పడిన మెడల్ ను పోలీసు అధికారికి అందించిన జగన్

Jagan handed medal to police
షార్ట్స్‌లో చూడండి
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశ వ్యాప్తంగా అందరూ ఘనంగా జరుపుకున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసులకు జగన్ మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రేహౌండ్స్ కు చెందిన గౌరునాయుడికి జగన్ మెడల్ ప్రదానం చేశారు. అనంతరం గౌరునాయుడు శాల్యూట్ చేస్తుండగా మెడల్ కిందపడింది. దీన్ని గుర్తించిన జగన్ మెడల్ తీసి మళ్లీ గౌరునాయుడికి ప్రదానం చేశారు. మరోవైపు, ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాము అందిస్తున్న నవరత్నాల పాలన ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థమని అన్నారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Police
Medal

More Telugu News