మోకాలి సర్జరీ చేయించుకోబోతున్న చిరంజీవి?
- గత కొంత కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న చిరంజీవి
- సర్జరీ చేయించుకోవాలని మెగాస్టార్ కు సూచించిన వైద్యులు
- హైదరాబాద్ లో కానీ, విదేశాల్లో కానీ సర్జరీ చేయించుకోనున్నట్టు సమాచారం
సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఏడాది కాలంలో ఆయన నాలుగు చిత్రాలు చేయడాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు. సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి సారించనున్నారు. దర్శకుడు కల్యాణ్ కృష్ణతో సినిమా ఇప్పటికే ఫైనలైజ్ అయిందట. మలయాళ హిట్ చిత్రం 'బ్రో డాడీ' రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మించనున్నారని సమాచారం.