రవితేజ ఫ్యాన్స్‌కు అలర్ట్.. ఈనెల 17న ‘టైగర్ నాగేశ్వరరావు’ దండయాత్ర
- రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం
- అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో రూపొందిస్తున్న వంశీ
- అక్టోబర్ 20న విడుదల కానున్న చిత్రం
ఈనెల 17న సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నట్టు దర్శకుడు వంశీ ప్రకటించాడు. ‘తమ్ముళ్లు నాకు మీ ఆవేశం, ఆక్రోశం అర్థమైంది. కానీ లోకంలో కొన్ని మంచి విషయాలు జరగాలంటే కొంత సమయం తీసుకుంటుంది. మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆకలి చూసి ఈ అప్డేట్ ఇస్తున్నాము. ఇన్ని రోజులు ఓపికగా వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు . ఇక మొదలెడదామా ’ అని ట్వీట్ చేశాడు. టైగర్ దండయాత్ర’ అంటూ ఓ కొత్త పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో ‘టైగర్ నాగేశ్వరరావు’ రాకకు చిహ్నంగా రవితేజ పాదాన్ని చూపించారు.