Balakrishna: 'జైలర్' సినిమాలో బాలయ్య ఉండాల్సిందట.. ఆ సినిమా డైరెక్టర్ ఏం చెప్పారంటే..!

Balakrishna should have acted in Jailer Movie says director Nelson Dileep Kumar
షార్ట్స్‌లో చూడండి
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమా సూపర్ హిట్ అయింది. హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో జాకీష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లు కామియో రోల్స్ ను పోషించడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజే ఈ చిత్రం రూ. 91 కోట్ల గ్రాస్ ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున రూ. 7 కోట్ల షేర్ వసూలు చేసింది. 

మరోవైపు ఈ చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంలో ఓ పాత్రకు బాలకృష్ణను తీసుకోవాలని అనుకున్నానని... అయితే కుదరలేదని చెప్పారు. ఓ పోలీసు పాత్ర కోసం బాలయ్యను అనుకున్నానని... అయితే, కథకు తగ్గట్టుగా ఆ పాత్రను క్రియేట్ చేయలేకపోయానని తెలిపారు. పాత్ర సరిగా కుదరనప్పుడు బాలయ్యను ఎంపిక చేయడం సరికాదని భావించానని చెప్పారు. అందుకే బాలయ్యను సంప్రదించలేదని తెలిపారు. భవిష్యత్తులో ఆయనతో సినిమా చేస్తానేమో అని అన్నారు. ఒకవేళ ఈ చిత్రంలో బాలయ్య నటించి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మరో రేంజ్ లో ఉండేదేమో!
Go Back to Shorts
Balakrishna
Jailer Movie
Tollywood
Kollywood
Rajinikanth
Nelson Dileep Kumar

More Telugu News