మహారాష్ట్రలోని ఇస్లాంపూర్ లో ఈరోజు బీఆర్ఎస్ భారీ బహిరంగసభ.. కేసీఆర్ లేకుండా తొలి సభ

BRS public meeting in Maharashtra today
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఈరోజు సాంగ్లీ జిల్లా ఇస్లాంపూర్ లో భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో జరిగిన బహిరంగసభలకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన లేకుండానే స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో భారీ సభ జరగబోతోంది. ఇటీవల కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన షేత్కారీ సంఘటన్ మహారాష్ట్ర అధ్యక్షుడు రఘునాథ్ పాటిల్ ఆధ్వర్యంలో సభ జరగనుంది. ఈ సభకు మహారాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఇన్ఛార్జీ కల్వకుంట్ల వంశీధర్ రావు, ఎంపీ బీబీ పాటిల్, మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదమ్, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే తదితరులు హాజరుకానున్నారు. ఈ సభలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షేత్కారీ సంఘటన్ నేతలు, కార్యకర్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. 

Go Back to Shorts
Maharashtra BRS
Rally
Islampur
KCR

More Telugu News