బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట
- వనమా ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చిన టీఎస్ హైకోర్ట్
- హైకోర్ట్ తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్ట్
- తదుపరి తీర్పు నాలుగు వారాలకు వాయిదా
వనమా ఎన్నిక చెల్లదంటూ గత నెల 25న తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలను సమర్పించినందుకు ఆయన ఎన్నిక చెల్లదని పేర్కొంది. అంతేకాదు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించింది. 2018 డిసెంబర్ 12 నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు కొనసాగుతారని తెలిపింది. ఈ నేపథ్యంలో వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన వనమా ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు.