వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒకే రోజు 380 కి.మీ ప్రయాణించిన చంద్రబాబు
- నెలూరు నుంచి ఏలూరు వరకూ సుదీర్ఘ ప్రయాణం
- ప్రాజెక్టులపై రైతులతో భేటీ
- గొంతునొప్పితో స్వరం బొంగురు పోయినా ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు
- ‘పుంగనూరు’ ఘటనలో ప్రభుత్వ తీరును ఖండించిన బాబు
చంద్రబాబు ఒకే రోజులో ఇంత దూరం ప్రయాణించి, ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గొంతునొప్పితో స్వరం కాస్త బొంగురు పోయినా చంద్రబాబు తన కార్యక్రమాలకు విరామం ఇవ్వట్లేదని చెప్పాయి. కాగా, పుంగనూరులో టీడీపీ నేతలు, కార్యకర్తల అరెస్టులను చంద్రబాబు ఖండించారు. అక్రమాలకు పాల్పడిన అధికారులు త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.