Advertisement

గద్దర్ వంటి మహనీయుడిని కోల్పోవడం సమాజానికి తీరని లోటు: సీఎం జగన్

CM Jagan reacts to Gaddar demise
  • తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ గద్దర్ మృతి
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్
  • పేదల కోసం ఉద్యమబాట పట్టిన మహోన్నతుడు గద్దర్ అంటూ ట్వీట్
ప్రజా యుద్ధనౌక గద్దర్ హైదరాబాదులోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూయడం తెలిసిందే. గత నెలలో హృదయ సంబంధ సమస్యతో ఆసుపత్రిలో చేరిన గద్దర్ కు ఈ నెల 3న బైపాస్ సర్జరీ చేశారు. అయితే ఊపిరితిత్తులు, మూత్రనాళ సమస్యలు తీవ్రం కావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 

గద్దర్ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ స్పందించారు. ప్రజా గాయకుడిగా తన పాటలతో పేదల్లో చైతన్యాన్ని నింపి, వారి హక్కుల సాధన కోసం ఉద్యమబాట పట్టిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని అభివర్ణించారు. అటువంటి మహనీయుడిని కోల్పోవడం సమాజానికి తీరని లోటు అని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. 

ఈ విషాద సమయంలో గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Advertisement
Jagan
Gaddar
Demise

More Telugu News