అసెంబ్లీ పని దినాలపై స్పష్టత రాలేదు.. సభాపతికి లేఖ రాస్తాం!: మల్లు భట్టివిక్రమార్క
- అతి తక్కువ రోజులు అసెంబ్లీని నడిపించిన చరిత్ర దక్కుతుందని ఎద్దేవా
- 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని లేఖ రాస్తామన్న భట్టి
- సభలో పలు అంశాలపై చర్చ జరగాల్సి ఉందని వెల్లడి
ఈ అంశంపై మల్లు భట్టి మాట్లాడుతూ... అసెంబ్లీ పని దినాలపై పూర్తి స్పష్టత ఇవ్వలేదన్నారు. అయితే ప్రభుత్వం కేవలం మూడు రోజులు మాత్రమే సభ నడపాలని చూస్తోందని విమర్శించారు. సమావేశాలను ఇరవై రోజుల పాటు నిర్వహించాలని కోరుతూ సభాపతికి లేఖ రాస్తామన్నారు. పోడు భూములు, ధరణి, సింగరేణి, బీసీ ప్లాన్‌పై శాసన సభలో చర్చ జరగాల్సి ఉందన్నారు. మైనార్టీ, ఎస్సీ సబ్ ప్లాన్‌పై చర్చకు డిమాండ్ చేయనున్నట్లు చెప్పారు.