వర్షాల ఎఫెక్ట్.. తిరుమలలో ఖాళీగా క్యూలైన్లు
- నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు
- వర్షాలు, వరదల కారణంగా తిరుమలలో తగ్గిన రద్దీ
- నో వెయిటింగ్ రూల్ ను అమలు చేస్తున్న టీటీడీ
వరుసగా మూడు రోజుల సెలవుల నేపథ్యంలో ఆదివారం వరకూ భక్తులతో కిటకిటిలాడిన తిరుమల కొండపై సోమవారం భక్తుల రద్దీ తగ్గింది. దీంతో స్వామి వారి దర్శనం సులభంగా అవుతోందని అధికారులు చెప్పారు. కాగా, ఆదివారం నాడు శ్రీవారిని 85,258 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ప్రకటించింది. హుండీ ద్వారా రూ.4.28 కోట్ల ఆదాయం సమకూరిందని పేర్కొంది.