గద్దర్ ను పరామర్శించిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!
Add ap7am to your home Screen

గద్దర్ ను పరామర్శించిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

Pawan Kalyan visits Gaddar in hospital
  • అనారోగ్యం పాలైన గద్దర్
  • జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • గద్దర్ ను కలుసుకుని ఆరోగ్య పరిస్థితిపై చర్చించిన పవన్
  • ప్రజాగాయకుడిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న జనసేనాని
ప్రజా గాయకుడు గద్దర్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. గద్దర్ చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి పవన్ వెళ్లారు. గద్దర్ ను కలుసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. పవన్ రాకతో గద్దర్ ముఖంలో ఉత్సాహం కనిపించింది. జనసేనాని ఆయనను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని పవన్... గద్దర్ కు సూచించారు. గద్దర్ ఏ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారన్నది తెలియరాలేదు.
Advertisement
Pawan Kalyan
Gaddar
Apollo Hospital

More Telugu News