కావలిలో 'బ్రో' సినిమా నిలిపివేత... గూడూరులో ఫ్లెక్సీల వివాదం
- పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో 'బ్రో'
- ఈరోజు థియేటర్లలో విడుదలైన చిత్రం
- సినిమాకు హిట్ టాక్ రావడంతో ఆనందంలో ఫ్యాన్స్
ఇంకోవైపు గూడూరులోని సింగం థియేటర్ వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సినిమా ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో పవన్ ఫ్యాన్స్ లో రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీల వివాదం తలెత్తింది. దీంతో, మధ్యలో కల్పించుకున్న థియేటర్ యాజమాన్యం ఫ్లెక్సీలను చించేసింది. ఇది పవన్ ఫ్యాన్స్ రెండు వర్గాలకు ఆగ్రహం తెప్పించింది. రెండు వర్గాలు కలిసి మూకుమ్మడిగా థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దీంతో, థియేటర్ యాజమాన్యం మళ్లీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.