సిక్స్ ప్యాక్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్
- ఫిట్ నెస్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన అర్జున్ టెండూల్కర్
- సిక్స్ ప్యాక్ తో ఉన్న మిర్రర్ సెల్ఫీ ఫొటోను షేర్ చేసిన అర్జున్
- ఈ ఐపీఎల్ లో మూడు వికెట్లు తీసి, 92 పరుగులు చేసిన అర్జున్
పేస్ బౌలర్ అయిన అర్జున్ ముఖ్యంగా ఫిట్ నెస్ పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో సిక్స్ ప్యాక్ బాడీని బిల్డప్ చేశాడు. షర్ట్ లెస్ లో తన సిక్స్ పాక్ యాబ్స్ ను చూపిస్తూ దిగిన మిర్రర్ సెల్ఫీ ఫొటోను అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిట్ నెస్ పట్ల అర్జున్ కు ఉన్న కమిట్ మెంట్ పై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.