4కె క్వాలిటీలో ‘భైరవద్వీపం’ రీరిలీజ్.. ఎప్పుడంటే..!
- ఈ మధ్య టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్
- బ్రహ్మరథం పడుతున్న అభిమానులు
- ఆగస్టు 5న భైరవద్వీపం రీరిలీజ్
దీన్ని 4కె క్వాలిటీతో ఆగస్టు 5న విడుదల చేస్తున్నట్టు క్లాప్స్ ఇన్ఫోటైన్‌మెంట్ అనే సంస్థ వెల్లడించింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో మైలురాయిగా నిలిలిచింది. ముప్ఫై ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ప్రభంజనం సృష్టించి, 9 నంది అవార్డులను కూడా గెలుచుకుంది. రోజా కథానాయికగా నటించిన ఈ సినిమాకు రావి కొండలరావు కథను అందించారు. మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. టీవీల్లోనూ ఈ సినిమా కొన్నేళ్ల పాటు సందడి చేసింది.