హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో తేల్చుకుంటా: వనమా వెంకటేశ్వరరావు
- వనమా ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు
- 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశానన్న వనమా
- బీఆర్ఎస్ అధిష్ఠానం అండదండలు ఉన్నాయన్న నేత
- సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటానని వ్యాఖ్య
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన వనమా ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. ఆ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇచ్చారంటూ ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం నిన్న తీర్పు వెలువరించింది. వనమా ఎన్నిక చెల్లదని పేర్కొంటూ, ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. అంతేకాకుండా అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రూ. 5 లక్షల జరిమానా విధించింది.