జోగి రమేశ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టిన జనసేన వీర మహిళలు
- నిన్న పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జోగి రమేశ్
- మార్చడం, తార్చడం పవన్ కు అలవాటేనన్న జోగి
- దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు జనసేన శ్రేణుల యత్నం
మరోవైపు జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు, జనసేన వీరమహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పిచ్చికుక్క జోగి రమేశ్ అంటూ ఆయన దిష్టిబొమ్మను వీరమహిళలు చెప్పుతో కొట్టారు. దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను లాక్కెళ్లారు. అమ్మిశెట్టి వాసును అదుపులోకి తీసుకున్నారు.