అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ స్పందన
- పుల్లంపేట వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
- ఆరుగురి దుర్మరణం
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్
- వేగ నియంత్రణపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని వెల్లడి
ఈ ప్రమాదంలో గాయపడిన 10 మందికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని, తగిన ఆర్థిక సహాయం అందించాలని పవన్ కల్యాణ్ సూచించారు.
సిమెంటు లోడుతో వెళుతున్న లారీ అతివేగంగా దూసుకురావడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని మీడియా ద్వారా తెలిసిందని అన్నారు. పోలీసు, రవాణ శాఖల అధికారులు రహదారి భద్రత చర్యల్లో భాగంగా వేగ నియంత్రణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జనసేనాని పేర్కొన్నారు.