ఇన్ స్టాగ్రామ్ లో పవన్ కల్యాణ్ మొదటి పోస్టు ఇదే!
Add ap7am to your home Screen

ఇన్ స్టాగ్రామ్ లో పవన్ కల్యాణ్ మొదటి పోస్టు ఇదే!

Pawan Kalyan makes first post in Instagram
  • ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్
  • నేడు తొలి పోస్టుతో బోణీ
  • తన సినీ కెరీర్ లోని వ్యక్తులతో వీడియో
  • మన బంధం ఇలాగే కొనసాగాలంటూ క్యాప్షన్
జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచారు. ఆయన ఒక్క పోస్టు పెట్టకుండానే మిలియన్లకొద్దీ వ్యూయర్స్ వాలిపోయారు. కాగా, పవన్ నేడు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తొలి పోస్టు పెట్టారు. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధంలేని రీతిలో పూర్తిగా సినిమా వాళ్లతోనే ఈ పోస్టు ముడిపడి ఉంది. 

తాను సినీ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎవరెవర్ని కలిశారో, వారందరితో అనుబంధాన్ని చాటేలా ఉన్న ఫొటోలతో ఓ వీడియోను రూపొందించిన పవన్... ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు పేరిట దాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. చలనచిత్ర పరిశ్రమలో భాగమై, ఎంతోమంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుడ్ని అంటూ ఆ వీడియో ప్రారంభంలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.  

చిరంజీవి, బాలకృష్ణ, అమితాబ్ బచ్చన్, నాగార్జున, వెంకటేశ్, రామ్ చరణ్, మహేశ్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, గోపీచంద్, సూపర్ స్టార్ కృష్ణ, అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, ఏఆర్ రెహమాన్, కుష్బూ, రాజమౌళి, వేణు మాధవ్, సారా జేన్ డయాస్, రవితేజ, బుర్రా సాయిమాధవ్, కె.విశ్వనాథ్, సమంత, ఇలియానా, మణిశర్మ, బోనీ కపూర్, రామానాయుడు, సురేశ్ బాబు, శ్రీనివాసరెడ్డి, అసిన్, ఎంఎస్ నారాయణ, రాఘవేంద్రరావు, సంపూర్ణేశ్ బాబు, చినబాబు (ఎస్ రాధాకృష్ణ), దేవి శ్రీ ప్రసాద్, రేణూ దేశాయ్, వైష్ణవ్ తేజ్, జానీ మాస్టర్, ఈవీవీ సత్యనారాయణ, ఆనంద్ సాయి, గద్దర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నాగబాబు, శర్వానంద్, క్రిష్, మీరా జాస్మిన్, బ్రహ్మానందం, తమన్, కిచ్చా సుదీప్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అనిరుధ్ రవిచందర్, శ్రీకాంత్, రమణ గోగుల, బీవీఎస్ఎన్ ప్రసాద్, పూరీ జగన్నాథ్, తనికెళ్ల భరణి, దిల్ రాజు, బ్రహ్మాజీ, అను ఇమ్మాన్యుయేల్, ప్రకాశ్ రాజ్, హైపర్ ఆది, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్, నీహారిక, ఆది సాయికుమార్, సముద్రఖని, విష్వక్సేన్, సునీల్, నాగవంశీ, మురళీశర్మ, గిరీశ్ కర్నాడ్, తమిళ హీరో విజయ్, విక్రమ్, కార్తీ, భూమిక, గబ్బర్ సింగ్ గ్యాంగ్ తదితరుల ఫొటోలను పవన్ తన వీడియోలో పంచుకున్నారు. 

మన బంధం ఇలాగే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాలను పంచుకోవాలని ఆశిస్తున్నానని తెలిపారు.
Advertisement
Pawan Kalyan
First Post
Instagram
Tollywood
Janasena

More Telugu News