ఎన్డీయే సమావేశానికి రావాలంటూ పవన్ కల్యాణ్ కు ఆహ్వానం.. హాజరవుతున్న జనసేనాని!
Add ap7am to your home Screen

ఎన్డీయే సమావేశానికి రావాలంటూ పవన్ కల్యాణ్ కు ఆహ్వానం.. హాజరవుతున్న జనసేనాని!

Pawan Kalyan has been invited for NDA meeting in Delhi
  • జులై 18న ఢిల్లీలో ఎన్డీయే సమావేశం
  • పవన్ ను ఆహ్వానించాలని కీలక నిర్ణయం తీసుకున్న ఎన్డీయే
  • ఎన్డీయే సమావేశానికి పవన్ తప్పకుండా హాజరవుతారన్న జనసేన పార్టీ
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ గ్రాఫ్ పెరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వారాహి యాత్రతో దూకుడు పెంచిన పవన్ కల్యాణ్ రాష్ట్ర అధికార పక్షంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏపీ రాజకీయాల్లోని ఈ పరిణామాలన్నింటినీ ఢిల్లీ పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నట్టు అర్థమవుతోంది. 

తాజాగా, ఢిల్లీలో జరిగే ఎన్డీయే సమావేశానికి హాజరు కావాలంటూ పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. జులై 18న ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జనసేనకు కూడా స్థానం కల్పించినట్టు అర్థమవుతోంది. 

ఎన్డీయే సమావేశానికి పవన్ తప్పకుండా హాజరవుతారని జనసేన పార్టీ వెల్లడించింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి ఈ నెల 17 సాయంత్రం పవన్ ఢిల్లీ చేరుకుంటారని వివరించింది.
Advertisement
Pawan Kalyan
NDA
New Delhi
Janasena
Andhra Pradesh

More Telugu News