పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు

Amanchi Swamulu joins Janasena
  • జనసేన తీర్థం పుచ్చుకున్న ఆమంచి స్వాములు
  • కండువా కప్పి జనసేనలోకి స్వాగతించిన పవన్ కల్యాణ్
  • పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచన
పర్చూరు వైసీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు (స్వాములు) జనసేన పార్టీలో చేరారు. ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్... ఆమంచి స్వాములుకు జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. 

ఆమంచి స్వాములు ఇవాళ బాపట్ల జిల్లా పందిళ్లపల్లి నుంచి భారీ అనుచరవర్గంతో మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చారు. చీరాల ఎమ్మెల్యేగా ఆమంచి కృష్ణమోహన్ రెండు పర్యాయాలు గెలవడంలో ఆయన అన్న ఆమంచి స్వాములు పాత్ర కీలకం. అయితే ఇప్పుడు ఆమంచి కుటుంబంలో తమ్ముడు వైసీపీలో ఉండగా, అన్న జనసేన పక్షాన చేరారు.
Go Back to Shorts
Amanchi Swamulu
Janasena
Pawan Kalyan
Amanchi Krishna Mohan

More Telugu News