Roja: సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్టుంది: పవన్ పై ఏపీ మంత్రి రోజా సెటైర్

Roja fires on Pawan Kalyan
షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి రోజా జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సంస్కారం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా అనిపిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా పవన్ ను శృంగార తార, బాలీవుడ్ భామ సన్నీ లియోన్ తో పోల్చారు. పవన్ సంస్కారం గురించి మాట్లాడుతుంటే సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్టుందని ఎద్దేవా చేశారు. 

పవన్ ఎవరి మాటా వినడని, అందుకే భార్యలు కూడా వదిలేశారని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఒక పనికిమాలిన వ్యక్తి అని, కరోనా సంక్షోభం సమయంలో హైదరాబాద్ లో దాక్కున్నాడని ఘాటుగా విమర్శించారు. 

ఎంతసేపూ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును చదవడమే పవన్ పని అని ఎద్దేవా చేశారు. మా అమ్మను తిట్టారు, నా పెళ్లాన్ని తిట్టారు, నా పిల్లలను తిట్టారు అనే ఏడుపు తప్ప పవన్ మరో మాట మాట్లాడడంలేదని రోజా పేర్కొన్నారు. చంద్రబాబు పూనిన చంద్రముఖిలా పవన్ రెచ్చిపోతున్నాడని వ్యాఖ్యానించారు. 

ఏపీ వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు మంత్రులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుండడం తెలిసిందే. ఓ రకంగా ఏపీ మంత్రులు పవన్ పై యుద్ధం ప్రకటించినట్టే కనిపిస్తోంది. జనసేనానిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు.
Go Back to Shorts
Roja
Pawan Kalyan

More Telugu News