రెమ్యునరేషన్‌ను బట్టి పవన్ కల్యాణ్ డైలాగ్, కాల్షీట్లు: మంత్రి వేణు
- జనసేనాని డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపణ
- పవన్ హాలీడే టూర్ చేస్తున్నారని విమర్శలు
- చంద్రబాబును అధికారంలోకి తీసుకు రావడానికి స్క్రిప్ట్ చదువుతున్నారని వ్యాఖ్య
పవన్ తన ఫామ్ హౌస్ లో ఉంటే సచివాలయ వ్యవస్థ గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. పవన్ కు నిలకడ లేదని, ఓపిక కూడా లేదన్నారు. పవన్ తన పిచ్చి మాటలతో ప్రజల నమ్మకం పోయేలా నడుచుకోవద్దని సూచించారు. అబద్ధానికి పవన్ కల్యాణ్ ఆసరాగా నిలిచారని నిందించారు. వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని చేసిన వ్యాఖ్యలు నాలుగైదు రోజులుగా దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే.