పవన్ కల్యాణ్ కు దమ్ము, ధైర్యం ఉంటే సింగిల్‌గా పోటీ చేయాలి: మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సవాల్
- జగన్ గెలుపును ఆపలేరన్న బాలనాగిరెడ్డి
- రూ.300 కోట్ల ప్యాకేజీ ఇస్తే పవన్ 'జై చంద్రబాబు' అంటారని ఎద్దేవా
- కరోనా సమయంలో ఇంట్లో దాక్కున్నారని విమర్శలు
వాలంటీర్లు, మహిళలపై పవన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. మాట్లాడే పద్ధతిని నేర్చుకోవాలన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడితే వర్షాలు కూడా పడవన్నారు. నారా లోకేశ్ తమ జిల్లాలో అడుగు పెట్టినందుకు వర్షాలు వెనక్కి వెళ్లాయన్నారు. చంద్రబాబు కంటే లోకేశ్ పెద్ద ఐరన్ లెగ్ అన్నారు. కాగా, వుమెన్ ట్రాఫికింగ్ అంటూ వాలంటీర్లపై జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి.