థాంక్యూ అన్నా... చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సీతక్క
Advertisement

థాంక్యూ అన్నా... చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సీతక్క

Seethakka thanked Chandrababu for his wishes
  • నేడు (జులై 9) ములుగు ఎమ్మెల్యే సీతక్క పుట్టినరోజు
  • సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • నా సోదరి అంటూ స్పందించిన చంద్రబాబుకు ఆత్మీయంగా బదులిచ్చిన సీతక్క
ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ధనసరి సీతక్క నేడు (జులై 9) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సీతక్కకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు. "ములుగు ఎమ్మెల్యే, నా సోదరి ఎమ్మెల్యే సీతక్కకు పుట్టినరోజు శుభకాంక్షలు. ప్రజల ఆశీర్వాదంతో మీరు నిండు నూరేళ్లు ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు. 

చంద్రబాబు ట్వీట్ పట్ల సీతక్క స్పందించారు. థాంక్యూ సో మచ్ అన్నా అంటూ ఆత్మీయంగా బదులిచ్చారు. కాగా, సీతక్క ఈసారి అమెరికాలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన ఆమె అభిమానుల ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సీతక్క యూట్యూబ్ లో పంచుకున్నారు.
Advertisement
Seethakka
Birthday
Chandrababu
MLA
Mulugu
Congress
Telangana

More Telugu News