ఈ నెల 9న ఏలూరు నుండి పవన్ రెండోదశ వారాహి విజయయాత్ర
- గత నెల 14న అన్నవరంలో ప్రారంభమైన తొలిదశ విజయయాత్ర
- రెండోదశ యాత్రకు సంబంధించిన ప్రణాళికపై నాదెండ్లతో చర్చ
- ఏలూరులో తలపెట్టిన బహిరంగ సభతో యాత్ర ప్రారంభం
పవన్ ఈ రోజు సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంలో రెండోదశ యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో సుదీర్ఘంగా చర్చించారు. 9వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఏలూరులో తలపెట్టిన బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులను కలిసి స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు.