ఒకే ఒక డైలాగ్.. దుమ్ము లేపిన సలార్ టీజర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒకే ఒక డైలాగ్.. దుమ్ము లేపిన సలార్ టీజర్!

Salaar part 1 teaser released
  • గురువారం తెల్లవారుజామున టీజర్ విడుదల చేసిన మేకర్స్
  • చిరుత..పులి..ప్రమాదకరమే గానీ అంటూ ప్రభాస్ క్యారెక్టర్‌కు ఎనలేని హైప్
  • ఉత్కంఠ కలిగించే విధంగా విలన్‌ పృథ్వీరాజ్ ఎంట్రీ 
  • సెప్టెంబర్ 28న విడుదల కానున్న సలార్: పార్ట్ 1 సీజ్‌ఫైర్
ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సలార్ టీజర్ రానే వచ్చింది. కేజీఎఫ్ మూవీస్‌తో దేశం చూపును తనవైపు తిప్పుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. గురువారం తెల్లవారుజామున మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. 

ఒకే ఒక డైలాగ్..!
సినిమా ఎలా ఉండబోతోంది? ప్రభాస్ క్యారెక్టర్ ఎంతగా ఎలివేట్ చేశారు? అనేది ఒక్క డైలాగ్‌తో మేకర్స్ ఎస్టాబ్లిష్  చేశారు. సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదకరం.. కానీ జురాసిక్ పార్కులో కాదు..ఎందుకంటే అక్కడ ఉండేది.. అంటూ టినూ ఆనంద్ డైలాగ్‌తో మొదలైన టీజర్ అభిమానుల్లో అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ మూవీలో ప్రభాస్ మాస్ విశ్వరూపం కనిపించబోతోందని చెప్పకనే చెప్పేసింది. 

కేజీఎఫ్ మార్కు టేకింగ్‌ ఉన్న సీన్స్‌తో ప్రభాస్‌ను కనిపించీ కనిపించనట్టుగా క్షణకాలంలో ఇంట్రడ్యూస్ చేయడం మరో విశేషం. నేటి తరం, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఏం కోరుకుంటున్నారో అదే తెరపై చూపించేందుకు దర్శకుడు పక్కా ప్రణాళిక వేసుకున్నాడనేది టీజర్‌తోనే తెలిసిపోయిందనేది అభిమానులు చెప్పే మాట. టీజర్ చివరల్లో పృథ్వీరాజ్‌ ఇంట్రడక్షన్ కూడా అదుర్స్ అనేది పబ్లిక్ టాక్. ఈ టీజర్‌తో ప్రభాస్ అభిమానుల్లో ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకోవడం పక్కా అనడంలో ఎటువంటి అతిశయోక్తీ ఉండదేమో. సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు  రానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహసన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
Salaar
Prabhas
Talking Movies

More Telugu News