Pawan Kalyan: విడిపోతున్నారని ప్రచారం.. పూజలో పాల్గొన్న పవన్ కల్యాణ్ దంపతుల ఫొటోతో చెక్

Janasena uploads Pawan Kalyan and Ana puja photo in social media
షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్, అనా లెజినోవా దంపతులు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ ప్రచారానికి జనసేన పరోక్షంగా చెక్ చెప్పే ప్రయత్నాలు చేసింది. వారాహి మొదటి విడత విజయవంతంగా పూర్తైనందున పవన్ దంపతులు తమ ఇంట్లో పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో పవన్ - అనా దంపతుల ఫొటోను జనసేన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తద్వారా విడిపోతున్నారనే వార్తలు అసత్య ప్రచారంగా తేల్చింది. 

'జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొన్ని రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు' అని పోస్ట్ పెట్టింది.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena

More Telugu News