మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
- మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ప్రమాదం
- ట్రక్కు బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్
- బైక్స్, కారు, కంటైనర్ పైకి దూసుకెళ్లిన ట్రక్కు
ఈ ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారని, ఇరవై మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ట్రక్కు మధ్యప్రదేశ్ నుండి ధులే వైపు వెళ్తోంది. బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న కొంతమంది కూడా ఈ ప్రమాద బాధితుల్లో ఉన్నారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, క్షతగాత్రులను శిర్పూర్, ధులేలోని ఆసుపత్రులకు తరలించారు.