కేసీఆర్ ను కలిసేందుకు వచ్చిన కేఏ పాల్.. వెనక్కి పంపించిన పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ ను కలిసేందుకు వచ్చిన కేఏ పాల్.. వెనక్కి పంపించిన పోలీసులు

Police sent back KA Paul from Pragathi Bhavan
  • ప్రగతి భవన్ లోకి వెళ్లేందుకు యత్నించిన కేఏ పాల్
  • ప్రపంచ శాంతి మహాసభలకు ఆహ్వానించేందుకు వచ్చానన్న పాల్
  • అపాయింట్ మెంట్ లేకుండా పంపించలేమన్న పోలీసులు
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కు చేదు అనుభవం ఎదురయింది. హైదరాబాదు, ప్రగతి భవన్ వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు ఆయన ప్రగతి భవన్ లోపలకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు ఆయనను ఆపేశారు. అపాయింట్ మెంట్ లేకుండా లోపలకు పంపించలేమని స్పష్టం చేశారు. తనను లోపలకు పంపించాలంటూ పోలీసులతో పాల్ వాగ్వాదం చేశారు. అక్టోబర్ లో జరిగే ప్రపంచ శాంతి మహాసభలకు కేసీఆర్ ను ఆహ్వానించేందుకు తాను వచ్చానని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు ఆయనను అనుమతించలేదు. గేటు వద్ద నుంచే ఆయనను పంపించి వేశారు.
Advertisement
KA Paul
KCR
BRS
Pragathi Bhavan

More Telugu News