Iswarya Menon: స్పై హీరోయిన్ కు జాక్ పాట్.. పవన్ సరసన అవకాశం!

SPY Heroine Gets Call From OG
షార్ట్స్‌లో చూడండి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ (ఓజస్ గంభీర) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ చిత్రం తారాగణం పెద్దగానే ఉంది. బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మి, ప్రకాశ్ రాజ్, తమిళ నటుడు అర్జున్ దాస్, శ్రేయా రెడ్డి తదితరులు నటిస్తున్నారు. పవన్ సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోషన్ ను తీసుకున్నారు. తాజాగా ఈ చిత్రంలోకి మరో యువ నటిని తీసుకున్నట్టు తెలుస్తోంది. 

నిఖిల్ హీరోగా వచ్చిన స్పై సినిమా హీరోయిన్ ఐశ్వర్యా మీనన్ కు ఆ అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. కేరళకు చెందిన ఐశ్వర్యా మీనన్ 2012లో విడుదలైన తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘లవ్ ఫెయిల్యూర్‌’తో టాలీవుడ్ కు పరిచయం అయింది. దాదాపు ఒక దశాబ్దం తర్వాత, నిఖిల్ సిద్ధార్థ్‌ తో కలిసి పూర్తి స్థాయి హీరోయిన్ గా  స్పై లో నటించింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన రాగా.. ఐశ్వర్యా మీనన్ తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా యువతను ఆకట్టుకుంది. దాంతో, ఓజీ నుంచి  ఆమెకు చాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Go Back to Shorts
Iswarya Menon
Pawan Kalyan
sujith
spy movie
OG movie
nikhil

More Telugu News