గ్రూప్‌4లో ‘బలగం’ సినిమాపై ప్రశ్న!

balagam movie question asked in ts group 4 exam
  • తెలంగాణలో ఈ రోజు గ్రూప్‌–4 పరీక్ష నిర్వహణ
  • నాలుగు ఆప్షన్స్ ను జత చేయాలంటూ ప్రశ్న
  • ఇటీవలి కానిస్టేబుల్‌ పరీక్షలోనూ బలగంపై ప్రశ్న ఇచ్చిన అధికారులు 
తెలంగాణలో ఈ రోజు టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్‌–4 పరీక్ష జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలో ‘బలగం’ సినిమాపై ఒక ప్రశ్న అడిగారు. దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, కొమురయ్య పాత్ర గురించి నాలుగు ఆప్షన్స్‌ను ఇచ్చి, వాటిని జత చేయాలంటూ ప్రశ్న ఇచ్చారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా బలగం సినిమా గురించి ప్రశ్న అడగడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలో కూడా ఒక ప్రశ్న ఇచ్చారు. 

2023లో ఒనికో ఫిలిమ్స్ అవార్డుల్లో ‘బలగం’ సినిమాకి ఏ విభాగంలో పురస్కారం లభించింది? అనే ప్రశ్నను ఇచ్చారు. అప్పుడు దీని గురించి దర్శకుడు వేణు యెల్దండి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే ఇలా సినిమా గురించి పదే పదే ప్రశ్నలు అడగడం సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

ఇక బలగం విషయానికి వస్తే.. సైలెంట్‌గా రిలీజై ప్రతి మనసునూ తాకిన సినిమా ఇది. తెలంగాణ పల్లెను, మట్టిని, మనుషులను ఆవిష్కరించింది. థియేటర్లలో, ఓటీటీలో సూపర్ హిట్ అయింది. ఊర్లలో జనమంతా కలిసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ సినిమా చూశారు. గ్రామాల్లో తెరలు కట్టుకుని చూసే 90ల నాటి పరిస్థితులు ఈ సినిమాతో మళ్లీ కనపిపించాయి.
Go Back to Shorts
balagam
group 4
balagam question in group 4
TSPSC

More Telugu News