జగన్ నొక్కని బటన్ లిస్టు ఇదే: పవన్ కల్యాణ్
- నరసాపురంలో పవన్ వారాహి విజయ యాత్ర
- బహిరంగ సభలో ప్రసంగించిన జనసేనాని
- పనికిమాలిన సలహాదారులు ఉన్నా ఉపయోగం లేదంటూ విమర్శలు
- నరసాపురంలో ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలేకపోయారని వెల్లడి
- పూర్తికాని పోలవరం ప్రాజెక్టు బటన్
- ఇంకా రాని ఉద్యోగాల నోటిఫికేషన్ బటన్
- నష్టపోయిన రైతుల పరిహారం బటన్
- ఇల్లు కోల్పోయి దీనస్థితిలో ఉన్న మత్స్యకారుల బటన్
- మద్దతు రాని కొబ్బరిసాగు బటన్
- దగ్ధమవుతున్న దేవాలయాలు, అంతర్వేది రథం బటన్
- ఇప్పటికీ పూర్తి కాని బ్రిడ్జి బటన్
- దళితులను చంపి బయట తిరుగుతున్న ఎమ్మెల్సీ బటన్
- ఆక్వారైతుకు రూ.1.5కి యూనిట్ విద్యుత్ ఇవ్వని బటన్
- అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్ బటన్
- మూతపడిన 8 వేల పాఠశాలల బటన్
- కొత్త కాలువలు కాదు కదా, కనీసం ఉన్న కాలువల పూడిక తీయలేకపోయిన బటన్
- ఆరోగ్యశ్రీ అందక కోల్పోయిన ప్రాణాల బటన్
- తాగునీరు దొరకని గ్రామాల బటన్
- స్వయం ఉపాధి కల్పించలేని బటన్
- అప్పుల్లోకి తోసేసిన ఆంధ్రప్రదేశ్ బటన్
- నిలిచిపోయిన అంబేద్కర్ విదేశీ విద్యాదీవెన బటన్
- నిరుద్యోగ యువత ఉపాధి బటన్
- ఆడబిడ్డల మాన ప్రాణాల బటన్...
ఇక ప్రసంగం చివర్లో పవన్ కల్యాణ్ పలు నినాదాలు చేశారు. జనం బాగుండాలంటే జగన్ పోవాలి... అరాచకం ఆగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి... అభివృద్ధి జరగాలి అంటే ఈ ప్రభుత్వం మారాలి... హలో ఏపీ... బైబై వైసీపీ అంటూ ప్రజలతోనూ నినాదాలు చేయించారు.