బీఫ్ తరలిస్తున్నాడన్న అనుమానంతో ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన గోరక్షకులు
- మహారాష్ట్రలో ఘటన
- కారును ధ్వంసం చేసి బాధితులను చావబాదిన నిందితులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరి మృతి
- పోలీసుల అదుపులో పదిమంది
ఘటనా స్థలానికి వెళ్లిన తమకు ధ్వంసమైన కారు కనిపించిందని, తీవ్రంగా గాయపడి కారులో ఉన్న ఇద్దరినీ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ అన్సారీ అనే వ్యక్తి మరణించారని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారు తరలిస్తున్న మాంసం బీఫా? కాదా? అనేది ల్యాబ్ పరీక్షల అనంతరం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.