JP Nadda: ప్రొఫెసర్ నాగేశ్వర్, కొరియోగ్రాఫర్ జయంత్ లను కలవనున్న జేపీ నడ్డా

JP Nadda to meet Prof Nageshwar
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. కాసేపు ఆయన నోవాటెల్ హోటల్ లో ఉంటారు. ఈ సమయంలో ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆనంద్ శంకర్ జయంత్ లతో సమావేశం కానున్నారు. 

ఆ తర్వాత సాయంత్రం 4.15 గంటలకు హెలికాప్టర్ ద్వారా నాగర్ కర్నూల్ సభకు వెళతారు. 5 గంటల నుంచి 6 గంటల వరకు సభలో పాల్గొంటారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7.40 గంటలకు ఎయిర్ పోర్ట్ నుంచి తిరువనంతపురంకు బయల్దేరతారు.
Go Back to Shorts
JP Nadda
BJP
Prof K Nageshwar

More Telugu News