బోల్డ్ కంటెంట్‌తో లస్ట్ స్టోరీస్2.. ట్రైలర్ వచ్చేసింది
- 2018లో సంచలనం రేపిన లస్ట్ స్టోరీస్ సిరీస్
- దానికి కొనసాగింపుగా వస్తున్న తాజా సిరీస్
- కీలక పాత్రల్లో నటించిన తమన్నా, కాజోల్, మృణాల్
తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. తమన్నాతో పాటు కాజోల్, మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, అమృత సుభాష్, అంగద్ బేడీ, విజయ్ వర్మ తదితరులు ఇందులో నటించారు. జీ కర్దా మాదిరిగా ఇందులోనూ తమన్నా రొమాంటిక్ సీన్స్‌లో నటించింది. లస్ట్ స్టోరీస్ 1 తరహాలోనే బోల్డ్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఈ వెబ్ సిరీస్ ఉండబోతోందని ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. నిజ జీవితంలో ప్రేమలో ఉన్న విజయ్ వర్మ, తమన్నా ఇందులో జంటగా నటించడం ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ఈ నెల 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.