తెలుగు బిగ్ బాస్ కొత్త సీజన్ కు వేళయ్యింది!

It is time for Telugu Bigg Boss new season
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బిగ్ బ్రదర్ గా వీక్షకులను అలరిస్తూ, భారత్ లో బిగ్ బాస్ గా రంగప్రవేశం చేసిన భారీ రియాల్టీ షో తెలుగులో 6 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక అందరి దృష్టి 7వ సీజన్ పై పడింది. ప్రస్తుతం తాజా సీజన్ కోసం సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

గత కొన్ని సీజన్ల పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తూ షోని విజయవంతం చేశారు. ఈసారి కూడా నాగ్ నే కంటిన్యూ చేస్తారా, లేక కొత్త హోస్ట్ ను తీసుకువస్తారా అన్నదానిపై క్లారిటీ లేదు. ప్రతి సీజన్ కు నాగార్జునే వస్తుండడంతో ప్రేక్షకులు రొటీన్ ఫీలింగ్ కు గురయ్యే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

కంటెస్టెంట్ల విషయానికొస్తే, ఈసారి కూడా నటులు, సింగర్లు, యాంకర్లు, యూట్యూబర్లు, న్యూస్ రీడర్లు, కమెడియన్ల కలయికలా కనిపిస్తోంది. 

నటి ఐశ్వర్య, యూట్యూబర్ దీపికా పిల్లి, అమర్ దీప్, నటి మిత్రా శర్మ, సింగర్ మంగ్లీ, కమెడియన్ రష్మీ, న్యూస్ ప్రజెంటర్ ప్రత్యూష, నటి శోభా శెట్టి, యూట్యూబర్ నిఖిల, డ్యాన్సర్ శ్వేతానాయుడు, సింగర్ హేమచంద్ర, సింగర్ మోహన భోగరాజు, మోడల్ సాయి రోనక్ ల పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే బిగ్ బాస్ సీజన్-7కి చెందిన ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
Go Back to Shorts
Bigg Boss-7
New Seasonb
Telugu
Andhra Pradesh
Telangana

More Telugu News