Sithara: ‘సారంగదరియా’ పాటకు సితార డ్యాన్స్.. ఇదిగో వీడియో!

mahesh babu daughter sitara dance saranga dariya song
  • చక్కని అభినయంతో, క్యూట్ స్టెప్పులతో అలరించిన సితార
  • లంగా ఓణీలో సాయిపల్లవిని గుర్తు చేసిన మహేశ్ బాబు గారాలపట్టి  
  • ఇన్ స్టాలో వీడియో వైరల్.. 4.40 లక్షల మందికిపైగా లైక్

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు గారాలపట్టి సితార గురించి అందరికి తెలిసిందే. సోషల్‌ మీడియాలో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. సితార షేర్‌ చేసే డ్యాన్స్‌ వీడియోలు, ఫోటోలు తెగ వైరల్‌ అవుతుంటాయి. తాజాగా లవ్ స్టోరీ సినిమాలోని ‘సారంగదరియా’ పాటకు డ్యాన్స్‌ చేసి, ఆ వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో సితార పోస్ట్‌ చేసింది.

చక్కని అభినయంతో, క్యూట్ స్టెప్పులతో అలరించింది సితార. లంగా ఓణీ ధరించి డ్యాన్స్ చేసి సాయిపల్లవిని గుర్తు చేసింది. ఈ సారంగదరియా సాంగ్‌ను సితారకు అనీ మాస్టర్‌ నేర్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు పెర్ఫామెన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 4.40 లక్షల మందికిపైగా లైక్ చేయడం గమనార్హం.

ఇన్ స్టా వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • Loading...

More Telugu News