క్లైమాక్స్ లోకి మెగాస్టార్ ‘భోళా శంకర్’ షూటింగ్

Bhola shankar climax shooting in hyderabad
  • హైదరాబాద్ మూసాపేటలో పోరాట సన్నివేశాల చిత్రీకరణ
  • మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం
  • ఆగస్టు 11న విడుదల
సెకండ్ ఇన్నింగ్స్‌లో వాల్తేరు వీరయ్య చిత్రాన్ని సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి జోరుమీదున్నారు. అదే జోరును కొనసాగిస్తూ 'భోళా శంకర్'తో మరో హిట్ అందుకోవాలని ఆశిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన 'వేదాలమ్'కి రీమేక్. ఇందులో చిరు సరసన తమన్నా హీరోయిన్‌ గా నటిస్తుండగా, కీర్తి సురేశ్ మెగాస్టార్‌‌ చెల్లెలి పాత్ర పోషిస్తోంది. సుశాంత్, మురళి శర్మ, రవి శంకర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను మెహర్ రమేశ్ చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ మూసాపేట ప్రాంతంలో వేసిన సెట్‌ లో కొన్ని రోజులుగా పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్ రాత్రి పూట చేస్తున్నట్టు సమాచారం. చిరంజీవితో పాటు కీర్తి సురేష్, సుశాంత్, మురళీ శర్మ, రవి శంకర్ తదితరులు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆగస్టు 11న సినిమా విడుదల అవుతుందని చిత్ర బృందం ప్రకటించింది.
Advertisement
megastar
Chiranjeevi
Bhola shankar
shooting
Tamannaah
Keerthy Suresh

More Telugu News