బీఆర్ఎస్ లో ఎవరికి పడితే వారికి స్థానం ఉండదు: సీఎం కేసీఆర్
- మహారాష్ట్రలోని నాగపూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఏర్పాటు
- ప్రారంభించిన సీఎం కేసీఆర్
- రైతులు, యువతకే పార్టీలో ప్రాధాన్యం అని స్పష్టీకరణ
- మహారాష్ట్రలో బీఆర్ఎస్ సుడిగాలి వేగంతో దూసుకెళుతోందని వెల్లడి
బీఆర్ఎస్ పార్టీ కమిటీల్లో ఇప్పటివరకు లక్షల మంది చేరారని, అయితే ఎవరికి పడితే వారికి పార్టీలో చోటివ్వబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులకు, యువతకే తమ ప్రాధాన్యత అని వివరించారు.
దేశంలో మార్పు కోసం బీఆర్ఎస్ ఒక మిషన్ లా పనిచేస్తుందని తెలిపారు. త్వరలోనే ముంబయి, నాందేడ్ వంటి నగరాల్లోనూ బీఆర్ఎస్ కార్యాలయాలు ప్రారంభిస్తామని, మరింత జోరు పెంచుతామని కేసీఆర్ వెల్లడించారు.