Tamannah: 'బాహుబలి'లో అంతగా ఫైట్స్ చేసినా క్రెడిట్ దక్కలేదు: తమన్నా

Tamannah Interview
షార్ట్స్‌లో చూడండి
'బాహుబలి' సినిమాను .. ఆ సినిమాలో తమన్నా గ్లామర్ ను ఎవరూ కూడా అంత త్వరగా మరిచిపోలేరు. ఈ సినిమాలో తమన్నా చేసిన యాక్షన్ సీన్స్ పెర్ఫెక్ట్ గా అనిపిస్తాయి. కత్తిని చాకచక్యంగా తిప్పుతూ శత్రువులపై విరుచుకుపడే సీన్స్ లో చాలా షార్ప్ గా ఆమె రియాక్ట్ కావడం కనిపిస్తుంది. తాజాగా అదే విషయాన్ని గురించి తమన్నా ప్రస్తావించింది. 

'బాహుబలి' సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాను. కానీ నేను ఆశించిన స్థాయి క్రెడిట్ నాకు దక్కలేదు. ఆ సినిమాకి సంబంధించిన క్రెడిట్ అంతా కూడా ప్రభాస్ - రానా ఖాతాలోకి వెళ్లిపోయింది. అయినా.. ఆ క్రెడిట్ వారికి వెళ్లడమే సమంజసంగా నాకు అనిపించింది. ఎందుకంటే వారు పడిన కష్టం కంటే నేను పడిన కష్టం చాలా తక్కువ" అంటూ చెప్పుకొచ్చింది.

అయితే 'బాహుబలి' తరువాత తమన్నా రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత తమన్నాకి ఆశించిన స్థాయి సినిమాలు లేవు. ఆ తరువాత ఆమె నిదానంగా పుంజుకుంటూ వెళ్లింది. ఇక ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో కీలకమైన రోల్స్ చేస్తూ, మరో వైపున వెబ్ సిరీస్ లతోను బిజీగానే ఉంది.
Go Back to Shorts
Tamannah
Actress
Tollywood

More Telugu News