పాటకు మూడు కోట్లు.. ఊర్వశీ రౌతేలా డిమాండ్ అలాంటిది మరి!
- వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ పాటతో టాలీవుడ్ లో గుర్తింపు
- ఏజెంట్ సినిమాలో ప్రత్యేక పాట చేసిన రౌతేలా
- పవన్–సాయితేజ్ చిత్రం నుంచి ఆఫర్
ఇలా వరుసగా ఆఫర్లు రావడంతో డిమాండ్ తగ్గట్టుగా తన రెమ్యునరేషన్ ను ఊర్వశీ అమాంతం పెంచిందని టాక్. ప్రస్తుతం ఆమె ఒక్కో పాటకు మూడు కోట్ల వరకూ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. పూజాహెగ్డే, రష్మిక మందన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ ప్రత్యేక పాట కోసం ఐదు కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారు. వారితో పోల్చుకుంటే కాస్త తక్కువే కావడంతో ఊర్వశీకి మూడు, నాలుగు నిమిషాల కోసం మూడు కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు వెనుకాడటం లేదట. ఏదేమైనా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఊర్వశీ రౌతేలా పక్కాగా పాటిస్తోంది.